వీడియో : సాయిపల్లవికి అందరితో గొడవలే..ఫిదా క్రెడిట్ ఆమెది కాదు..!

Tuesday, January 16th, 2018, 12:05:58 AM IST

సాధారణంగా ఏ ఇండస్ట్రీ లోకైనా పురుషాధిక్యం సహజంగా కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో కూడా హీరోలదే రాజ్యం. ఏ హీరోయిన్ అయినా అణిగి మణిగి ఉండకపోతే ఆమె కు భవిష్యత్తు ఉండదనేది చిత్ర పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఇటీవల టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయి పల్లవి. చలాకి మాటలు, నటనలో చురుకుదనం కలబోసిన ఈ హీరోయిన్ కు అప్పుడే కుర్ర కారులో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది. సాయి పల్లవి కోసం సినిమాకు వెళ్లే వాళ్ళ చాలా మందే ఉన్నారు. కానీ సాయి పల్లవి హీరోలతో చిత్ర యూనిట్ తో గొడవ పడుతుందని ఇటీవల కామెంట్లు వినిపిస్తున్నాయి.

వీటి గురించి యువ హీరో నాగ సౌర్య ని ప్రశ్నించగా సాయి పల్లవి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయిపల్లవి అందరితో గొడవ పడుతుందని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటని ఇంటర్వ్యూ లో నాగ సౌర్యకు ప్రశ్న ఎదురైంది. సాయి పల్లవి గురించి అలంటి రూమర్లు వస్తున్నాయి. నా చిత్రంలో కూడా అలాంటి గొడవలు జరిగాయి. కాబట్టి అది నిజమే అని అనిపిస్తున్నట్లు నాగ సూర్య బదులిచ్చాడు. ఇక ఫిదా చిత్ర క్రెడిట్ సాయి పల్లవిది కాదని అన్నాడు. శేఖర్ కమ్ముల అలాంటి కథ రాయకున్నా, వరుణ్ తేజ్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ చేయకున్నా సినిమా హిట్ అయ్యేది కాదని, కాబట్టి సాయి పల్లవిది మాత్రమే క్రెడిట్ అనడం సరికాదని తెలిపాడు.

ఫిదా చిత్రంలో సాయి పల్లవికి నటనకు టాలీవుడ్ మొత్తం నిజంగానే ఫిదా అయింది. సాయి పల్లవి చలాకి నటనతోనే సినిమా బ్లాక్ బాస్టర్ అయిందనే చాలా మంది ప్రశంసించారు. నాగ సౌర్య కామెంట్లు అర్థం లేనివిగా ఆమె అభిమానులు చెబుతున్నారు.