దర్శకుడిగా మారుతున్న ఛలో హీరో!

Saturday, May 12th, 2018, 10:21:37 PM IST


ఛలో సినిమాతో కెరీర్ లో అతిపెద్ద హిట్ అందుకొని తన మార్కెట్ ను పెంచుకున్నాడు నాగ శౌర్య. ఆ విజయంతో ఈ హీరోకు ప్రస్తుతం మంచి మంచి ఆఫర్స్ అందుతున్నాయి. అయితే హీరోగా అలా సక్సెస్ అందుకున్నాడో లేదో దర్శకుడిగా నిరూపించేందుకు సిద్దమయ్యాడు. అయితే అది సినిమా కాదులెండి. ఒక షార్ట్ ఫిల్మ్. మదర్స్ డే సందర్బంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుపుతూ.. మహిళలు ఈ సమాజానికి రూపకర్తలు. ఎన్నో రూపాల్లో వారి కర్తవ్యాన్ని నిర్వహించి అందరు గర్వపడేలా చేసి.. శక్తివంతమైన మాతృమూర్తులు ఒక దేశం సత్తాను చాటుతారు. అలాంటి వాళ్ళకు సెల్యూట్ చేయటం కోసమే ‘భూమి’ షార్ట్ ఫిలిం అంటూ రేపు షార్ట్ ఫిల్మ్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఛలో సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ లఘు చిత్రానికి పని చేశారు. ఇక ప్రస్తుతం నాగ శౌర్య నర్తనశాల అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.