గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగశౌర్య ?

Friday, September 28th, 2018, 12:21:23 PM IST

లేటెస్ట్ గా స్మాల్ బడ్జెట్ తో తెరకెక్కించిన గీత గోవిందం సినిమా సంచలన విజయం అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో గీత ఆర్ట్స్ చిన్న సినిమాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ బ్యానర్ లో హీరో నాగ శౌర్య తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. నాగశౌర్య హీరోగా ఓ యువ దర్శకుడితో సినిమాకు ప్లాన్ చేసారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందట. ఈ మద్యే @ నర్తనశాల సినిమాలో నటించిన శౌర్య కు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. మంచి కమర్షియల్ హిట్ ను అందుకోవాలన్న ఆశలను గీత ఆర్ట్స్ లో తీరుతుందేమో చూడాలి.