ఆ బాబుల దారిలో… నాగ శౌర్య ?

Friday, July 27th, 2018, 07:34:56 PM IST

ఏంటి శోభన్ బాబు… జగపతి బాబుల దారిలో యంగ్ హీరో నాగ శౌర్య వెళుతున్నాడా ? అంటే అయన కూడా ఇద్దరు పెళ్ళాల నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ సినిమా చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు ? అప్పట్లో తెరపై ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే పాత్రల్లో జీవించి ఆకట్టుకున్నారు శోభన్ బాబు .. ఆ తరువాత అదే రేంజ్ లో ఇద్దరు పెళ్ళాల సినిమాలు చేసి అయన స్థానాన్ని భర్తీ చేసాడు మన జగ్గూభాయ్. తాజాగా ఈ లిస్ట్ ల ఒకే వస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. జగపతి బాబు కెరీర్ లో మంచి క్రేజ్ తెచ్చిన చిత్రం ఆయనకి ఇద్దరు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. తాజగా ఈ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారట. ఆ సినిమాను నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా మర్చి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. రాజా అనే దర్శకుడు ఈ సినిమాను తెరక్కిస్తాడట. భవ్య క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది. నాగ శౌర్య ప్రస్తుతం నర్తనశాల చిత్రంలో నటిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరి నాగ శౌర్య కూడా ఈ సినిమా తరువాత శోభను, జగపతి ల స్తానని భర్తీ చేస్తాడేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments