బ‌డ్జెట్‌లో సినిమా తీసి, కోట్ల‌లో ఆర్జించ‌డ‌మెలా?

Tuesday, December 5th, 2017, 05:59:47 PM IST

ఫార్ములా తెలిస్తే సినీప‌రిశ్ర‌మ‌లో సంపాదించినంత సులువుగా ఇంకే ప‌రిశ్ర‌మ‌లోనూ సంపాదించ‌లేరేమో! రాత్రికి రాత్రి సీన్ మారిపోతుంది. భారీ డీల్స్‌తో ద‌శ తిరిగిపోతుంది. బ‌డ్జెట్‌ని అదుపులో పెట్టి, మంచి క‌థాంశాన్ని ఎన్నుకుని సినిమాలు తీసేవాళ్లకు బిజినెస్ ప‌ర‌మైన ఢోఖాయే ఉండ‌డం లేదు. చిన్న‌పాటి క్రేజును ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌తో క్రియేట్ చేయ‌గ‌లిగితే వ్యాపారం స‌జావుగానే సాగుతోంది. పైగా ఇటీవ‌లి కాలంలో చిన్న సినిమాల‌కు మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టింద‌నే చెప్పాలి. ఇప్పుడిపుడే కెరీర్ మ‌లుచుకుంటున్న న‌వ‌త‌రం హీరోల‌కు సైతం బాగా క‌లిసొస్తోంది. రాజ్ త‌రుణ్ లాంటి ఏ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోనే అంచెలంచెలుగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుంటూ ఎదిగేస్తున్నాడు.

ఇక కొద్దో గొప్పో బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాగ శౌర్య లాంటి హీరోకి తిరుగేం ఉంటుంది. ఈ యంగ్ హీరో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో `ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో పెద్ద విజ‌యం అందుకున్నాడు. అటుపై కెరీర్ ప‌రంగా తిరిగి చూసిందే లేదు. ప్ర‌స్తుతం ఇత‌ర బ్యాన‌ర్ల‌లో న‌టిస్తూనే సొంత బ్యాన‌ర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. వోన్ బ్యాన‌ర్‌లో `ఛ‌లో` అనే మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రాన‌కి త్రివిక్ర‌మ్ శిష్యుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `కిర్రాక్ పార్టీ`(క‌న్న‌డ‌) ఫేం రష్మీ మంద‌న క‌థానాయిక‌గా న‌టించింది. రీసెంటుగా లాంచ్ అయిన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ స‌హా సాంగ్ ప్రేక్ష‌క‌జ‌నాల్లోకి దూసుకెళ్లిపోయాయి. దీంతో ఈ సినిమాకి రిలీజ్ ముందే అద్భుత‌మైన బిజినెస్ సాగింద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ బిజినెస్ బావుంది. అలాగే ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్ జెమిని 2.52 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ ఛేజిక్కించుకుందిట‌. 2.50 కోట్లు రేటు కోట్ చేస్తే, దానికి మ‌రో 2ల‌క్ష‌లు క‌లుపుకుని 2.52కి నిర్మాత అయిన నాగ‌శౌర్య డాడ్ ఫైన‌ల్ చేశారుట‌. అలాగే హిందీ రిలీజ్ రైట్స్‌ని భారీగానే ప‌లికింద‌ని, త‌మిళ రీమేక్ బేర‌సారాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఇక డిజిట‌ల్ రైట్స్‌, ఆడియో రైట్స్ వ‌గైరా క‌లుపుకుని రిలీజ్‌కి చాలా ముందే టేబుల్ ప్రాఫిట్‌లోకి వ‌చ్చేసిందిట‌. ఇక హిట్టు వైపు ఛ‌లో అన‌డ‌మే ఆల‌స్యం.. అని చెబుతున్నారు. ఇక ఈ స్పీడ్ చూస్తుంటే నాగ‌శౌర్య నెక్ట్స్ లెవ‌ల్‌కి వెళ్లేందుకు సొంత బ్యాన‌ర్ అక్క‌ర‌కొస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments