జనసేనకు,సేనానికి సాయం చేస్తానంటున్న మెగా బ్రదర్ !

Monday, January 30th, 2017, 10:19:15 PM IST

naga-babu-janasena
మెగాబ్రదర్ నాగబాబు అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో తనవంతు పాత్రని పోషించారు.ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాగబాబు రాజకీయాల వైపు చూడలేదు.కాగా ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై దృష్టి పెట్టారా అనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.

తనకు రాజకీయాల్లో ఏదైనా చేయాలని అనిపిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ద్వారానే చేస్తానని నాగబాబు అన్నారు.జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు చేతనైన సాయం అందిస్తానని అన్నారు.దీనితో నాగబాబు జనసేనలో చేరాలనే తన కోరికని చెప్పకనే చెప్పినట్లు విశ్లేషకులు అంటున్నారు.పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి నాగబాబు మద్దత్తు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం తరువాత నాగబాబు ఎలాంటి రాజకీయ కలాపాలు జరపలేదు. దీనితో ఆయన పవన్ జనసేన పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు చిరంజీవి కూడా రాజకీయంగా యాక్టివ్ గా లేరన్న విషయం తెలిసిందే.