నేను వారిని బాధపెట్టేలా మాట్లాడాను – నాగబాబు

Sunday, February 26th, 2017, 11:39:56 AM IST


ఖైదీ 150 ఆడియో ఫంక్షన్ లో రామ్ గోపాల్ వర్మ మీదా యండమూరి వీరేంద్రనాథ్ మీదా నాగబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దాని తరవాత వారు అతని మాటలకి రియాక్ట్ కూడా అయ్యారు. ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఒకరిని లక్ష్యంగా చేసుకుని ఒకటికి, పదిసార్లు మాట్లాడితే, అందరూ దాన్నే నిజమనుకుంటారని, ఆ భావన తొలగించాలన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. ఆ రోజు తాను కొంచెం మంచిగా, మర్యాదగా చెప్పి ఉంటే బాగుండేదని, కొంచెం హార్ష్ గానే మాట్లాడానని అంగీకరించాడు. అయినా వాళ్లకు ఎక్కలేదని అన్నాడు. వర్మ, యండమూరితో తనకు వైరం లేదని, వారు ఎన్ని అన్నా పట్టించుకోబోనని తెలిపాడు.