బ్రేకింగ్ : నాగబాబు నుంచి మరో సంచలన ట్వీట్.!

Sunday, May 24th, 2020, 12:00:10 PM IST

జనసేన పార్టీ కీలక నేత మరియు మెగా బ్రదర్ నాగబాబు ఏపీ రాజకీయ వర్గాల్లో చేసే కామెంట్స్ ఎప్పుడూ ఏదొక సంచలనం రేపుతూనే ఉన్నాయి. అలా కొన్ని రోజుల కితం గాడ్సే విషయంలో చేసిన విషయం పవన్ వరకు వెళ్లి ఆగ్రహాన్ని తెప్పించింది. దానితో నాగబాబు వ్యక్తిగత అభిప్రాయాలకు తన పార్టీకు సంబంధం లేదని తేల్చి చెప్పేసారు.

అలాగే ఇప్పుడు ఏపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంపై తాను ఒక సంచలన ట్వీట్ పెట్టారు. జగన్ సర్కార్ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను అమ్మకానికి పెట్టాలని జీవో జారీ చెయ్యడం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

దీనితో ప్రజల్లో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. ఇప్పుడు ఈ అంశంపైనే నాగబాబు సంచలన ట్వీట్ పెట్టారు. అందరినీ కాపాడే ఏడు కొండల వాడా నీ ఆస్తులను నువ్వే కాపాడుకోవాలి అంటూ ట్వీట్ చేసారు. దీనితో సోషల్ మీడియా జనం కూడా దీనికి కాస్త సపోర్ట్ చేస్తున్నారు.