రాజకీయాల్లో మెగాస్టార్ కింగ్ కాదన్న మెగా బ్రదర్..!

Sunday, January 29th, 2017, 07:30:45 PM IST

nagababu
మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో అభిమానులంతా చిరంజీవిని వ్యతిరేకించారని కానీ సినిమాల్లో మాత్రం అయన అందరివాడని అన్నారు.చిరంజీవి ఖైదీ నెం 150 ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవికి ఎప్పటిలానే మంచి ఆదరణ ఉంటుందని అనుకున్నామని కానీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా అభిమానుల ఆదరణ ఉందని నాగబాబు అన్నారు.

చిరంజీవి సినిమాల్లో అందరివాడని రాజకీయాల్లోకి వెళితే కొందరి వాడు మాత్రమే అవుతాడని తాను అప్పట్లోనే అన్నట్లు నాగబాబు గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో గతంలో కంటే పదిరెట్లు ఎక్కువ ఆదరణని అభిమానులు చూపిస్తున్నారని నాగబాబు అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కింగ్ చిరంజీవే అని నాగబాబు అన్నారు.