షాకింగ్ : పవన్ ఫ్యాన్స్ కు మరోసారి నాగబాబు మాస్ వార్నింగ్.!

Thursday, February 27th, 2020, 08:31:47 AM IST

జనసేన పార్టీలో ఆ పార్టీ అధినేత తర్వాత మళ్ళీ అంత ప్రాధాన్యత ఎవరికీ ఉంటుంది అంటే పవన్ చేసే చర్యలతోనే చెప్పెయ్యొచ్చు అది నాదెండ్ల మనోహరే అని.అయితే ఎప్పుడూ కలిసే ఉండే ఈ ఇద్దరూ గత కొన్ని రోజులు నుంచి మాత్రం అంతగా కలిసి కనపడడం లేదు.దీనితో ఆయన పార్టీకు దూరంగా ఉంటున్నారనే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి.

అయితే మనోహర్ జనసేనలో చేరినప్పటి నుంచి ఎలాంటి పాత్ర పోషించారో అందరికి తెలుసు అలాగే అదే సమయంలో అతనిపై పవన్ కు వెన్ను పోటు పొడుస్తారంటూ కొన్ని వార్తలు కూడా ప్రచారం జరిగాయి.అలా గత కొన్ని రోజుల నుంచి మరోసారి నాదెండ్ల మనోహర్ పై పవన్ మరియు జనసేన పార్టీ అభిమానుల పేరిట కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని సంచలన వార్తలు ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు.

దీనితో వారందరికీ కలిపి అదే పార్టీకు చెందిన నేత మరియు పవన్ సోదరుడు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.”మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్న కొంత మంది ఫాన్స్ అని చెప్పుకుంటున్న (eg. చందు లాంటి) వాళ్ళని పవన్ కళ్యాణ్ ఫాన్సనుంచి ఎప్పుడో దూరంగా పెట్టటం జరిగింది.జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకి వ్యతిరేకంగా మాట్లాడే ఏ మెగా ఫాన్స్ లేదా పవన్ ఫాన్స్ ని మేము డిస్ డౌన్ చేసుకుంటున్నాం.

అలాంటి వాళ్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోన బడతాయ్.మనోహర్ గారు ఒక క్రమశిక్షణ కలిగిన ఒక జనసేన కార్యకర్త,నాయకుడు.అలాంటి నాయకుల గురించి మాట్లాడటం అనేది నేను ఖండిస్తున్నా.ఇలాంటి క్రమశిక్షణ లేని అభిమానులు జనసేన కార్యకర్తలం అని చెప్పుకునే ఫేక్ మనుషుల కి ఎవరు స్పందించ వద్దని మనవి.” అంటూ వారికి ట్విట్టర్ ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారు.మరి ఈ ప్రచారాలు చేస్తున్న వారు ఇకనైనా మానుకుంటారో లేదో చూడాలి.