పవన్ పై రోజా విమర్శలు – నాగబాబు ఏమంటున్నారో తెలుసా…?

Wednesday, November 13th, 2019, 03:00:36 AM IST

ప్రముఖ నటి, వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచుకున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా గత కొంత కాలంగా చాలా సైలెంట్ గా ఉంటుంది. పక్కాగా చెప్పాలంటే మాత్రం ఎన్నికలకు ముందున్నటువంటి కోపం, ఆవేశం, అన్ని కూడా ఇప్పుడు తగ్గించుకొని చాలా శాంతంగా ఉంటుంది నగరి ఎమ్మెల్యే రోజా. ఇకపోతే రోజా ప్రస్తుతానికి అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరొకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రోజా తో పాటే నాగబాబు కూడా ఈ కార్యక్రమానికి జడ్జి గా వ్యవహరిస్తున్నారు. కాగా వీరిద్దరూ కూడా రెండు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు.

ఇక అసలు విషయం ఏంటంటే… నాగబాబు గారు ఇటీవల ఒక ప్రైవేట్ మీడియా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా రోజా గారు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ని విమర్శించినప్పటికీ కూడా మీరు తన పక్కన కూర్చొని ఇలాగె నవ్వుతూ ఉంటారా అనే ప్రశ్నకు సమాధానంగా నాగబాబు కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు. రోజా, తాను ఒక కార్యక్రమంలో ఇద్దరం కూడా కలిసి జడ్జి గా పని చేస్తున్నాం. అది మా ప్రొఫెషన్. కానీ తాను బయట ఏం మాట్లాడితే నాకేంటి, మేము ఇక్కడ ఉన్నంత సేపు ప్రొఫెషన్ గానే ఉంటామని, బయట సంగతులు బయటే చూసుకుంటాం అని చెప్పారు. అంతేకాకుండా బయట విషయాలు, రాజకీయ విషయాలు మేము ఇక్కడ చర్చించుకోమని నాగబాబు స్పష్టం చేశారు.