బిగ్ బజార్లో సమంత చైతన్య… యాడ్ చూసారా..?

Sunday, April 22nd, 2018, 01:32:13 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత. పెళ్ళికి ముందు ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల‌లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. పెళ్ళి త‌ర్వాత తొలి సారి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్దమయ్యారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల‌లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రేయ‌సి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అయితే వీరు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికి అడ‌పాద‌డ‌పా యాడ్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ప‌రేట్‌గా యాడ్‌లో న‌టించిన స‌మంత‌, చైతూలు తొలి సారి బిగ్ బ‌జార్‌కి సంబంధించిన యాడ్‌లో న‌టించారు. పెళ్ళి చూపులు వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన త‌రుణ్ భాస్క‌ర్ ఈ యాడ్‌ని చిత్రీకరించారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.