నేను సరిగ్గానే కిస్ పెట్టాను – నాగార్జున

Wednesday, February 8th, 2017, 11:47:09 AM IST


తనకి జీవితం ఇచ్చింది హీరో నాగార్జున అని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో షేర్ చేసుకోగా దాని గురించీ , శివ సినిమా గురించీ నాగార్జున స్పందించారు. ఆయన తన మనసులో మాటని రెప్లై ద్వారా రామూ కి తెలియ జేశారు. ‘శివ’ చిత్రంలో ‘కిస్ మీ రాంగ్ నంబర్’ పాటను చిత్రీకరిస్తున్న వేళ, ఓ వైపు అమల, మరోవైపు నాగ్ కూర్చుండగా, వారికి మధ్యలో రాంగోపాల్ వర్మ నిలబడి సలహాలిస్తున్న ఫోటోను రామ్ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన నాగార్జున ‘హాయ్ రామ్… ఎంత అద్భుత జ్ఞాపకాన్ని గుర్తు చేశావు. అయితే నేను సరైన నంబర్ నే కిస్ చేశాను’ అని స్పందించాడు. దీనిపై రామ్, రీట్వీట్ చేస్తూ, ‘ఆహా, అవును సార్’ అని ఒప్పుకున్నాడు.

[2:40]