వర్మ సినిమాలో నాగ్ పాత్ర ఏమిటో.. తెలుసా ?

Sunday, November 5th, 2017, 09:22:05 AM IST

సంచలన దర్శకుడు వర్మ చాల రోజుల తరువాత నాగార్జునను ఒప్పించాడు. శివతో నాగార్జునకు కొత్త ఇమేజ్ అందించిన వర్మ ఆ తరువాత గోవిందా గోవిందా చిత్రాన్ని తీసాడు. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మళ్ళీ నాగార్జునతో శివ 2 సినిమాకు కమిట్ అయ్యాడు. తాజాగా ఈ సినిమాకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న వర్మ నాగార్జునతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ఓ సూపర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట. నవంబర్ 20న ప్రారంబం అయ్యే ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఏమిటో తెలుసా .. సూపర్ కాప్ అంట !! సూపర్ కొప్ కథతో ఈ సినిమా స్టైలిష్ మేకింగ్ లో ఉంటుందట. సూపర్ కాప్ అనగానే వర్మ కామన్ ఎలిమెంట్స్ .. మాఫియా తప్పకుండ ఉంటుంది కదా .. మరి శివతో సంచలనం క్రియేట్ చేసిన వర్మ .. రెండో శివతో ఎలాంటి సంచలనం రేపుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments