మళ్ళీ మీలో ఎవరు కోటీశ్వరుడు లో నాగార్జున !

Sunday, February 12th, 2017, 12:33:11 PM IST


మీలో ఎవరు కోటీశ్వరుడు కి టాటా చెప్పేసినా కూడా నాగార్జున ఆ షో ని వదలలేక పోతున్నారు కాబోలు ఇప్పుడు ఆయన హోస్ట్ గా సెలవు ప్రకటించినా గెస్ట్ గా అడుగు పెట్టబోతున్నారు. ఓం నమో వెంకటేశాయ సినిమా ప్రమోషన్ లో భాగంగా అడుగు పెట్టబోతున్నారు నాగార్జున. ఈ సినిమా విడుదలకు ముందు చిరుకు స్పెషల్ షో వేశామని.. అది చూస్తూ ఆయన కన్నీళ్లు పెట్టేసుకున్నారని నాగ్ తెలిపాడు. నన్ను కూడా ఏడిపించేశావ్ కదా నాగ్.. అంటూ చిరు తన జేబులో తడిగా ఉన్న టిష్యూలను తనకు చూపించినట్లు నాగ్ తెలిపాడు. అన్నమయ్య సినిమాతో భక్తి రస ప్రధాన చిత్రాలకి కేర్ ఆఫ్ గా మారిన నాగ్ ఈ సినిమాతో నిజంగానే అందరినీ ఏడిపించారు. ‘ఓం నమో వేంకటేశాయ’ సమయానికి తాను వ్యక్తిగా చాలా చాలా మారానని నాగ్ చెప్పాడు. ఇదంతా రాఘవేంద్రరావు గారి వల్లే సాధ్యమైందని.. ఆయన.. జె.కె.భారవి కలిసి మూడు నాలుగేళ్లు ఎంతో కష్టపడి.. తపించి ‘ఓం నమో వేంకటేశాయ’ను ఇంత బాగా తీర్చిదిద్దారని నాగ్ తెలిపాడు