నాగార్జున సినిమా కూడా .. లీకయిందట !!

Friday, November 25th, 2016, 01:55:56 AM IST

namo-venkatesha
ఈ మధ్య టాలీవుడ్ లో చాలా సినిమాలు షూటింగ్ దశలోనే లీక్ అయి భారీ నష్టాన్నే చవి చూస్తున్నాయి. లేటెస్ట్ గా ”బాహుబలి2” సినిమాలోని కొన్ని సీన్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన ”అత్తారింటికి దారేది” సినిమా ఫస్ట్ హాఫ్ లీక్ అయి సిడిల రూపంలో బయటికి వచ్చి టాలీవుడ్ ని షేక్ చేసింది .. లేటెస్ట్ గా అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ”ఓం నమో వెంకటేశాయ” సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయట !! కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది. వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఓ వైపు జరుగుతున్నాయి, ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనుల్లో ఉండగా .. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇద్దరు యువకులు తమ మొబైల్ లో షూట్ చేసినట్టు తెలిసింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. ఆ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అలాగే సోషల్ మీడియా లో ఉన్న ఆ వీడియొ ఫుటెజ్ ని తొలగించేసారు.