యంగ్ హీరోలకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరిన నాగ్ ?

Saturday, June 2nd, 2018, 10:43:07 AM IST

ప్రస్తుతం సెలెబ్రిటీస్ మొత్తం ఫిట్నెస్ ఛాలెంజ్ పై పడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి మనం ఫిట్ గా ఉంటె దేశం కూడా ఫిట్ గా ఉంటుందంటూ విసిరిన ఛాలెంజ్ వైరల్ గా మారింది. లేటెస్ట్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ కు ఫిట్నెస్ ఛాలంజ్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని నాగార్జున కూడా అఖిల్ విసిరిన ఛాలెంజ్ స్వీకరిస్తూ తాను కూడా జిమ్ లో వర్కవుట్ చేస్తూ యంగ్ హీరోలు నాని, కార్తీ , హీరోయిన్ శిల్పారెడ్డి లకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరాడు. ఫిట్నెస్ తో ఉన్న వీడియోస్ పోస్ట్ చేయాలనీ కోరాడు. 58 ఎల్లా వయసులో నాగ్ .. చేస్తున్న జిమ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫిట్నెస్ పై నాని, కార్తీ, శిల్పా రెడ్డి లు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.