16వ శ‌తాబ్ధపు అరేబియ‌న్ రాజు క‌థ‌లో..

Wednesday, September 5th, 2018, 10:57:48 PM IST

కింగ్ నాగార్జున ప్ర‌యోగాల గురించి తెలిసిందే. ఒక స్క్రిప్టుకి ఇంకో స్క్రిప్టుకి అస్స‌లు సంబంధం లేకుండా ప్లాన్ చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. కార్తీతో క‌లిసి ఊపిరి చిత్రంలో న‌టించిన నాగార్జున‌, నానితో క‌లిసి దేవ‌దాస్ చిత్రంలో న‌టిస్తున్నారు. న‌వ‌త‌రం హీరోల‌తో ఈగోల్లేకుండా క‌లిసిపోయి న‌టిస్తున్నారు. మ‌రోవైపు బాలీవుడ్‌లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్టులోనూ నాగార్జున న‌టిస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌ల్లూవుడ్‌లో ఓ భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో నాగార్జున న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. కింగ్ స్నేహితుడు ప్రియ‌ద‌ర్శ‌న్ ఇప్ప‌టికే ఆ క‌థ లైన్‌ని వినిపించారు. అరేబియా మ‌హాస‌ముద్రం బ్యాక్‌డ్రాప్ క‌థాంశ‌మిది. `మ‌క్క‌ర్ – ది ల‌య‌న్ ఆఫ్ ది అరేబియ‌న్‌` బ‌యోపిక్ ఇది. 16వ శ‌తాబ్ధానికి చెందిన `కుంజ‌లి మ‌ర‌క్కార్ 4` అనే ముస్లిమ్ నావెల్ ఎక్స్‌ప్లోర‌ర్ జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. నావెల్ బేస్డ్ స్టోరి అంటే సినిమా ఆద్యంతం ఓడ‌ల‌పైనే సాగుతుంద‌ని అంచ‌నా వేయొచ్చు. కేర‌ళ‌-కొచ్చి ఏరియాలో సంచ‌రించిన‌ పోర్చ్‌గీస్ రాజుల స్టోరీని ఎలివేట్ చేస్తార‌ట‌. అయితే ఇది నిజ‌మా? అని నాగార్జున‌నే అడిగితే.. ఇంకా పూర్తి క‌థ వినాల్సి ఉంద‌ని అన్నారు. జూన్ నాటికి ప్రియ‌ద‌ర్శ‌న్ పూర్తి స్క్రిప్టుని వినిపిస్తారు. అది విన్న త‌ర్వాత చెప్పాలి.. అని అన్నారు. ప్ర‌స్తుతం నానితో సినిమానే దృష్టంతా అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments