వైఎస్సాఆర్ బయోపిక్ లో నాగార్జున?

Sunday, February 4th, 2018, 12:01:02 AM IST

ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇప్పటికే తెలుగు లో ఎన్టీఆర్ బయోపిక్ కు బాలయ్య సిద్దమవగా, మహానటి సావిత్రి బయోపిక్ నటి కీర్తి సురేష్ తో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర కూడా తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకులు మహి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు, ప్రస్తుతం స్క్రిప్ట్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బయోపిక్ లో వైఎస్సాఆర్ పాత్రకు ఎవరైనా ఫెమిలియర్ నటుడు పోషిస్తే ఆ పాత్ర , చిత్రం ఎక్కువమందికి చేరుతుందని అంటున్నారు. అందుకే ఆ పాత్ర కోసం తెలుగులోనే కాక కన్నడ, తమిళ, హిందీ లోని అనేక మంది నటులను పరిశీలిస్తున్నారట. అయితే ఈ చిత్ర విషయమై ఇప్పుడు ఒక సంచలన వార్త అందుతోంది. ఈ బయోపిక్ లో యువసామ్రాట్ నాగార్జున నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున వైఎస్సాఆర్ పాత్ర ఆనందంగా చేస్తాను, కానీ అది కూడా ఒక కండీషన్ మీద అయితే చేస్తాను అన్నట్లు సమాచారం. అదేంటంటే ఈ చిత్రంలో నటించాక, విడుదల మాత్రం 2019 ఎలక్షన్ల సమయంలో వుండకూడదన్నారట. ఒకవేళ ఎన్నికల వేళ రిలీజ్ అయితే లేనిపోని అనుమానాలు, అపార్థాలకు దారితీస్తుంది అన్నట్లు సమాచారం. అయితే ఈ బయోపిక్ లో వైఎస్సాఆర్ పుట్టుక నుండి మరణం వరకు ఉండదని, కేవలం ఆయన జీవితం లోని కీలక ఘట్టాలు మాత్రమే వుంటాయని తెలుస్తోంది…..