మళయాలంలో మన్మధుడు

Monday, May 7th, 2018, 11:43:09 PM IST


కింగ్ నాగార్జున మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుగున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ఆ మేర‌కు ఇప్ప‌టికే మంత‌నాలు పూర్త‌య్యాయి. త‌న ఫ్రెండు, స‌న్నిహితుడు ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అందుకు మార్గం సుగ‌మం అయ్యింద‌ని తెలుస్తోంది. ఇది మ‌ల‌యాళం, తెలుగు మ‌ల్టీస్టార‌ర్ అని, ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ ఓ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి నాగార్జున ఇటీవ‌లి కాలంలో మ‌ల్టీస్టార‌ర్ క‌థాంశాల‌కు ఓకే చెబుతున్నారు. ప్ర‌స్తుతం నానీతో ఆ త‌ర‌హా క‌థాంశ‌మే. ఇదివ‌ర‌కూ కార్తీతో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌ చేశారు. ఇక లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించే మ‌హాభార‌తం చిత్రంలో క‌ర్ణుడి పాత్ర‌కు త‌న‌ని సంప్ర‌దించ‌గా, ఇప్ప‌టికి పెండింగులో పెట్టార‌ని చెప్పుకున్నారు. ఇలా చూస్తే కింగ్ ఆలోచ‌న సంథింగ్ డిఫ‌రెంటుగా ఉంద‌ని అర్థం చేసుకోవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments