నాగార్జున సినిమాకు కష్టాలు తప్పదా !!

Saturday, February 18th, 2017, 10:25:48 AM IST


నాగార్జున నటించిన లెటస్ట్ భక్తి సినిమా ఓం నమో వెంకటేశాయ. కె రాఘవేంద్ర రావు దర్శత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమా కష్ఠాలు తప్పడం లేదట !! అదేంటి సినిమా హిట్ అంటున్నారు మరి వసూళ్లు లేవా ? అంటే అవుననే అనాల్సి వస్తుంది. ఈ సినిమా చుసిన ప్రేక్షకులకు నచ్చింది కానీ వసూళ్లు మాత్రం వీక్ గా ఉన్నాయి. సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరు ఈ సినిమా విషయంలో చాలా డిస్సప్పాయింట్ తో ఉన్నారట ? కానీ ఈస్ట్ గోదావరి జిల్లా పరిస్థితి మాత్రం మరి దారుణంగా ఉందట !! అక్కడ ఆరొవ రోజు కేవలం 20 వేల షేర్ సాధించిన సినిమాగా నిలిచింది. కానీ ఎడొవ రోజు మాత్రం ఒక్క రూపాయి కూడా షేర్ రాలేదట !! థియేటర్ రెంట్స్ , ఇతర ఖర్చలు పోనీ ఒక్క రూపాయి మిగలలేదని అంటున్నారు. ఒక టాప్ హీరో సినిమా, అందులోను భక్తి సినిమాకు ఇలా కలక్షన్స్ రావడం బాధాకరం అని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అది కాకుండా మిగతా ఏరియాల్లో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని వాపోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ?