మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నాగ్ ?

Saturday, January 13th, 2018, 12:50:02 PM IST

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందుంటారు. అటు విభిన్నమైన సినిమాల్లో నటిస్తూనే మరో వైపు నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ లాంటి సంచలన చిత్రాన్ని రూపొందించిన కాంబినేషన్ లో మళ్ళీ 25 ఏళ్ల తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్నా సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత నాగార్జున ఓ కొత్త దర్శకుడికి ఓకే చెప్పాడట. వంశీ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. సో వర్మ సినిమా తరువాత నాగార్జున నటించే సినిమా ఇదే కావడం విశేషం. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.