నాగార్జున మరో మల్టిస్టారర్ చేస్తున్నాడుగా ?

Wednesday, January 17th, 2018, 07:00:49 PM IST

టాలీవుడ్ లో కొత్తదనాన్ని పరిచయం చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందుంటారు. అందుకే ఆయన చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేసారు. దాంతో పాటు నిర్మాతగా మారి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. మరో వైపు ఇతర హీరోలతో మల్టి స్టారర్ కు రెడీ అంటున్నారు. ఇప్పటికే నానితో కలిసి ఓ మల్టి స్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున తాజాగా మరో మల్టి స్టారర్ చేయడానికి రెడీ అన్నాడట ? అయితే ఈ సారి అయన ఏ హీరోతో కలిసి నటిస్తున్నాడో తెలుసా .. కోలీవుడ్ లో సొంతంగా ఎదిగి అటు బాలీవుడ్ లోకూడా తన సత్తా చాటిన ధనుష్ తో కలిసి నాగార్జున ఓ సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఓ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ను వర్కవుట్ చేస్తున్నాడట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. మరి ఇద్దరు హీరోల మల్టి స్టారర్ అంటే నిజంగా సంచలనం అని చెప్పాలి.