అదే మాకు ఆస్కార్..చంద్రబాబు నందిపై నాగ్ రియాక్షన్..!

Thursday, December 7th, 2017, 09:51:55 PM IST

ఏపీ ప్రభుత్వాన్ని నంది అవార్డుల గొడవ ఓ కుదుపు కుదిపేసింది. కొన్ని రోజులపాటు ఈ వ్యవహారంపై మీడియాలో ఎంత హాట్ డిబేట్ జరిగిందో అందరికి తెలిసిందే. అక్కినేని కుటుంబం కలసి నటించిన చిత్రం, ఏఎన్నార్ చివరి చిత్రం అయిన ‘మనం’ కేంద్రంగా ప్రధాన చర్చ జరిగింది. మనం వంటి క్లాసికల్ మూవీని నంది అవార్డు కోసం జ్యురి సభ్యులు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నల వర్షం కురిసింది. ఎట్టకేలకు ఈ వివాదంపై నాగార్జున స్పందించారు.

ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నంది గొడవ గురించి మాట్లాడారు. మనం చిత్రానికి ప్రేక్షకులు వారి హృదయాల్ని ఇచ్చారని, అది మాకు ఆస్కార్ కంటే ఎక్కువే అని నాగ్ అన్నారు. నంది అవార్డుల గొడవ గురించి నాగ్ కు అవగాహన ఉన్నట్లు గానే ఈ వ్యాఖ్య ద్వారా అర్థం అవుతుంది. మనం చిత్రానికి అన్యాయం జరిగిందని వాదనలు వినిపిస్తే, బాలయ్య లెజెండ్ సినిమా విషయంలో గ్యాంబ్లింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.