మల్టీ స్టారర్ సినిమాకు ఓకే అంటున్న నాగార్జున ?

Friday, February 10th, 2017, 01:30:25 PM IST


అక్కినేని నాగార్జున లేటెస్ట్ సినిమా ”ఓం నమో వెంకటేశాయ” ఈ రోజు విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో నాగార్జున నటనతో మెప్పించాడు. విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు అనూహ్య స్పందన వస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి వంటి భిన్నమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు నాగార్జున. లేటెస్ట్ గా అయన మల్టి స్టారర్ సినిమా చేస్తానని అంటున్నాడు .. అదికూడా తన తోటి హీరోలయిన .. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన నాగార్జున ఈ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికి నవ మన్మదుడిగా గ్లామర్ ను మైంటైన్ చేస్తున్న నాగార్జున యువ హీరోలతో కూడా మల్టి స్టారర్ చేసిన ఆశ్చర్య పోవలసిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో మల్టి స్టారర్ సినిమా అంటే నిజంగా అది పెద్ద సంచలనం అని చెప్పాలి .. మరి ఈ ప్రయత్నం ఎవరు చేస్తారో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments