కింగు కింగే..షాకిస్తున్న నాగ్ కొత్త లుక్..!

Tuesday, January 2nd, 2018, 09:25:19 PM IST

టాలీవుడ్ హీరోలలో ఫిట్ నెస్ గురించి మాట్లాడుకుంటే నాగార్జున తరువాతే ఎవరైనా అని అనిపించక మానదు. వయసు పైబడుతున్నా నాగ్ ఇప్పటికి ఎవరు గ్రీన్ లుక్ లో అదరగొడుతుంటాడు. కాగా నేటి ఉందయం నుంచి నాగ్ కొత్త లుక్ ఒకటి నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో నాగ్ బాడీ ఫిట్ నెస్ అదుర్స్ అని చెప్పొచ్చు. నాగ్ పేస్ బుక్ లో ఈ ఫోటోని పోస్ట్ చేసారు. దానిపై నాగ్ – ఆర్జీవీ 4 అని రాసి ఉండడం విశేషం.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం బాడీని ఫిట్ గా తయారు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో నాగ్ డెడికేషన్ సూపర్ అని ప్రశంసలు కురుస్తున్నాయి. ఏ చిత్రానికి గన్, సిస్టమ్ అనే పేర్లని పరిశీలిస్తున్నారు.