మహానటితో నాగ్ మధుర జ్ఞాపకాలు…ట్విట్టర్ లో హల్ చల్

Wednesday, April 18th, 2018, 10:22:07 AM IST

తెలుగు సినీ ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల న‌టి సావిత్రి. ఏ పాత్ర‌కైన జీవం పోసే ఆమె మ‌హాన‌టిగా అంద‌రిచే కీర్తించ‌బడుతుంది. సావిత్రి జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్ ఇప్ప‌టికే తెర‌కెక్క‌గా, మే 9న చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్కర్ స‌ల్మాన్‌, మోహ‌న్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌,భానుప్రియ త‌దిత‌ర న‌టీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ కూడా విడుద‌ల కాగా, దీనికి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఓ అభిమాని.. నాగ్‌ని ఎత్తుకొని ఉన్న‌ సావిత్రి ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ ఫోటోపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు నాగ్‌. మ‌ధుర‌మైన జ్ఞాప‌కాన్ని గుర్తు చేసిన అభిమానికి థ్యాంక్స్ చెప్పిన నాగార్జున‌, వెలుగు

నీడ‌లు చిత్రంలోని స‌న్నివేశానికి సంబంధించిన ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ పిక్ ఇటు సావిత్రి అటు అక్కినేని అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. నాగార్జున రీసెంట్‌గా వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆఫీస‌ర్ అనే చిత్రం చేయ‌గా, వ‌చ్చే నెల‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments