ఇలా ఎందుకు జ‌రుగుతోంది?

Wednesday, February 22nd, 2017, 01:31:01 PM IST


జీవితం అంద‌రి దూలా తీర్చేస్తుంది! ఇదీ పూరి జ‌గ‌న్నాథ్ ఫిలాస‌ఫీ. అటు వెండితెర‌పై, ఇటు రియ‌ల్ లైఫ్‌లో అత‌డు అనుస‌రించే, ఆచ‌రించే ప‌ద్ధ‌తి కూడా ఇదే. ఎందుకంటే అలాంటి ఝ‌ల‌క్‌లు తిన్నాడు మ‌నోడు. అయితే అక్కినేని ఫ్యామిలీలో ఇటీవ‌లి కాలంలో ప‌రిణామాలు చూస్తే అలానే అనిపించ‌క‌మాన‌దు. ముఖ్య ంగా అక్కినేని అఖిల్ విష‌యంలో కాస్త తిర‌కాసుగానే ఉంది వ్య‌వ‌హారం అని ప‌రిశ్ర‌మ‌లో ముచ్చ‌టించుకుంటున్నారు. అటు సినిమాల కెరీర్‌, ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ రెండు చోట్లా అఖిల్ అనుకుంటున్న‌దొక‌టి.. అయిన‌దొక‌టి అన్న‌ట్టే క‌నిపిస్తోంది. తొలిచిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. ఇక ప్ర‌ఖ్యాత ఇండ‌స్ట్రీయ‌లిస్ట్‌ జీవీకె మ‌న‌వ‌రాలు శ్రీయా భూపాల్‌తో ప్రేమాయ‌ణం, అటుపై నిశ్చితార్థం .. ఈ వేస‌విలో ఇట‌లీలో డెస్టినీ మ్యారేజ్ ప్లాన్స్‌.. అందుకు ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గానే .. ఈలోగానే ఈ పెళ్లి ఇక లేదు అన్న వార్త టాలీవుడ్‌లో షాకింగ్‌.

అయితే ఇందులో పెద్ద‌ల తప్పేమీ లేదు. పిల్ల‌లే వ‌ద్ద‌నుకున్నారు. యువ‌ర‌క్తం అయిన‌ అఖిల్‌-శ్రీయ మ‌ధ్య ఏదో జ‌రిగింది. అందుకే ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా జ‌ర‌గ‌డం నాగార్జునలో ఓకింత ఒత్తిడికి కార‌ణ‌మ‌వుతోంద‌ని, అందుకే ఇటీవ‌ల ఆయ‌న షూటింగుల‌కు వెళ్ల‌కుండా ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు. అయితే `జీవితంలో ఏం జ‌రిగినా అంతా మ‌న మంచికే` అనుకోవడం ప‌రిపాటి. ఇలాంటివాటికి కింగ్ జంక‌రు. వైఫ‌ల్యాలే విజ‌యానికి సోఫానాలు. ఇక అన్నిటా గెలుపే ల‌క్ష్య ంగా అఖిల్ ముందుకు దూసుకుపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇవ‌న్నీ క్ష‌ణిక‌మైన‌వే. కాలమే అన్నిటికీ స‌మాధానం చెబుతుంది. లెట్స్ వెయిట్‌.