నాగార్జున సినిమా టైటిల్ … మారనుందా?

Tuesday, December 27th, 2016, 05:45:41 PM IST

nagarjunanew-movie
ఈ మధ్య సినిమాల విషయంలో చాలా వివాదాలు రేగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, మా వాళ్ళను కించ పరచారంటూ, లేదా ఆ టైటిల్ పెట్టొద్దని రకరకాల వివాదాలు రేగాయి. ఇప్పుడు ఈ టెన్షన్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా సినిమాకు పడ్డట్టుంది? నాగార్జున సినిమా పై వివాదాల .. ఇంతకీ ఏమిటి సంగతి అంటే .. అక్కినేని నాగార్జున హీరోగా కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందుతున్న ”ఓం నమో వెంకటేశాయ” సినిమా టైటిల్ మార్చాలంటూ చిన్న వివాదం రేగుతుంది? ఆ వివరాల్లోకి వెళితే శ్రీ వేంకటేశ్వరుడి పరమ భక్తుడు హథీరాం బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హథీరాం బాబాగా నాగార్జున నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను ”హథీరాం బాబాజి” గా మార్చాలని సేవాలాల్ సేన డిమాండ్ చేస్తుంది. లెటస్ట్ గా ఈ విషయం పై ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు? మరి ఈ విషయం పై నాగార్జున, రాఘవేంద్ర రావు లు ఎలా స్పందిస్తారో, అసలు ఈ టైటిల్ మారుస్తారా, లేదా అలాగే ఉంచేస్తారా అనేది తెలియాల్సి ఉంది?

  •  
  •  
  •  
  •  

Comments