ఆసక్తి రేపుతున్న నాగశౌర్య సైన్ధవాః ?

Tuesday, April 10th, 2018, 09:30:25 AM IST

ప్రస్తుతం ఓ టైటిల్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంతకి ఆ టైటిల్ ఏమిటో తెలుసా సైన్ధవాః ? లేటెస్ట్ గా చలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ శౌర్య ప్రస్తుతం నర్తనశాల సినిమాలో నటిస్తున్నాడు . దాంతో పాటు అమ్మగారిల్లు, కణం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయ్. వీటితో పాటు నాగ శౌర్య మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. తాజాగా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. అయితే ఈ సినిమాకు సైన్ధవాః అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. సైన్ధవుడు అనే పాత్ర మహాభారతంలో కనిపిస్తుంది. ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సైన్ధవుడు పాండవులు ప్రాణభిక్ష పెట్టడంతో బతికి బట్ట కడతాడు. ఆ తరువాత అభిమన్యుడి మరణానికి కారకుడవుతాడు. అలాంటి నెగిటివ్ వ్యక్తి పేరుతొ ఈ సినిమా టైటిల్ రావడం ఆసక్తి రేపుతోంది. మరి ఈ కథ ఎలాంటితో తెలియదు కానీ టైటిల్ తోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments