బంగార్రాజు ప్రయత్నాలు మొదలు పెట్టాడు ?

Wednesday, May 16th, 2018, 12:55:52 PM IST

నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ ఆ తరువాత చేసిన రారండోయ్ వేడుక చూద్దాం కూడా మంచి విజయాన్ని అందించింది, దాంతో రవితేజతో ఛాన్స్ పట్టేసిన అయన నేల టికెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాగార్జునతో మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జునను కొత్తగా .. బంగార్రాజు పాత్రలో చూపించి ఆకట్టుకున్నాడు. ఆ పాత్ర జనాల్లోకి బాగా దూసుకుపోయింది.

అంతే కాదు ఆ పాత్ర పట్ల నాగార్జున ఆసక్తిగా ఉన్నాడు .. దాంతో సీక్వెల్ ప్లాన్ చేసారు, కానీ వేరే కమిట్మెంట్స్ వల్ల అప్పుడు కుదరలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా జరిగాయని తెలిసింది. నాగార్జున తాజాగా ఆఫీసర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల ప్లాన్ చేసారు. నాగ్ నెక్స్ట్ సినిమాకు మార్గం క్లియర్ అయింది కాబట్టి ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కుదిరితే జూన్ 25న ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.