రూమర్ కి కౌంటర్ వేసిన నమిత

Wednesday, October 18th, 2017, 02:49:05 PM IST

టాలీవుడ్ లో రూమర్స్ కి చెక్ పెట్టాలని మా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా వరకు వెబ్ సైట్ లపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రూమర్స్ టాలీవుడ్ లో ఇంకా తెగ హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా సౌంత్ చబ్బీ గర్ల్ నమిత పై కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అయితే విషయం అమ్మడికి తెలియయడంతో ఆ న్యూస్ అబద్దమని కౌంటర్ వేసింది.

అయితే నమిత తెలుగు సీనియర్ నటుడిని వివాహం చేసుకోవడానికి రెడీగా ఉందని కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు. శరత్ బాబు అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అరవై ఏళ్ల వ్యక్తిని నమిత పెళ్లి చేసుకోవడం ఏమిటని కొందరు కామెంట్స్ చేశారు. ఫైనల్ గా నమిత వరకు విషయం రావడంతో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అది ఒక ఫెక్ న్యూస్ అని కొట్టి పారేసింది. అంతే కాకుండా అది ఒక సిల్లీ రూమర్ అని చెప్పింది.

namitha comments on rumars