షాక్ .. బొద్దుగుమ్మ మళ్ళీ వస్తుందోచ్?

Sunday, May 20th, 2018, 09:49:05 AM IST

సౌత్ లో బొద్దుగుమ్మగా ఎందరో రసిక హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ నమిత రీ ఎంట్రీకి సిద్ధం అయింది ? అదేంటి పెళ్లయి ఎక్కువ రోజులు కూడా కాలేదుగా ? అని షాక్ అవుతున్నారా ? నిజమే ఈ మద్యే తన బాయ్ ఫ్రెండ్ వీరేన్ చౌదరిని పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టిన ఈ అమ్మడు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తాన్తంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రీ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చేసింది. పెళ్ళికి ముందు నమిత నటించిన పొట్టు చిత్రం ఈ నెల 25న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో నమిత ప్రముఖ దర్శక నిర్మాత టి రాజేందర్ నిర్మించే సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగె ఈ చిత్రంలో నమిత ప్రధాన పాత్ర పోషిస్తుందట. ఇక హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన నమిత రీ ఎంట్రీ అన్న విషయం తెలియడంతో రసిక హృదయాల్లో కొత్త ఆశలు చిగురించాయట. తమ అభిమాన హీరోయిన్ మళ్ళీ వస్తుందంటూ ఆమె ఫాన్స్ తెగ ఖుషి చేస్తున్నారట. సో త్వరలోనే నమిత నటించే సినిమా గురించి ప్రకటిస్తుందట !!

  •  
  •  
  •  
  •  

Comments