వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్..!

Friday, March 5th, 2021, 05:13:20 PM IST

ఏపీ మంత్రి కన్నబాబుకు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు నాంపల్లి కోర్టు నాన్ ‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసుపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టగా మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు హాజర్ కాలేదు. దీనిపై సీరియస్ అయిన కోర్టు వచ్చే వాయిదాకు వారిద్దరు రావాల్సిందేనని పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అంతేకాదు ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే గతంలో హెరిటేజ్ సంస్థపై మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ కోర్టులో పరువునష్టం దావా వేసింది. అయితే వారిద్దరు ఫిబ్రవరి 5వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించినప్పటికి వారు హాజరుకాకపోవడంతో తాజాగా వారిపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.