త‌నూశ్రీ‌పై దాడి.. నానాకు చుట్టుకున్న ఎవిడెన్స్‌?!

Tuesday, October 2nd, 2018, 01:25:58 AM IST

కార్ అద్దాలు ప‌గ‌ల‌గొట్టి.. గాలి తీసేసి!! చుట్టు ముట్టేసి!!! ఈ దృశ్యాలు చూశారా? చూడ‌గానే షాక్ కొడుతోంది. 2008లో నానా ప‌టేక‌ర్ దాడి చేయించిన‌ప్ప‌టి దృశ్యాలు ఇవేనంటూ ఒక‌టే మోతెక్కిపోతోంది. త‌నూశ్రీ ద‌త్తా- నానా ప‌టేక‌ర్ మ‌ధ్య వివాదం చినికి చినికి గాలివాన అవుతోంది అన‌డానికి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్.

`’హార్న్ ఒకే ప్లీజ్` అనే సినిమా పాట షూటింగ్ జరిగే సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది త‌నూశ్రీ‌. ఆ క్ర‌మంలోనే అత‌డితో న‌టించ‌న‌ని త‌ను వెళ్లిపోతున్న టైమ్‌లో ఎటాక్ ఇద‌ని ప్ర‌చారం సాగుతోంది. త‌నూశ్రీ ద‌త్తా ఓ సాంగ్ షూట్ నుంచి కార్‌లో వెళ్లిపోతోంది. త‌న‌తో పాటే త‌ల్లిదండ్రులు ఆ కార్‌లో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే నానా మ‌నుషులు వ‌చ్చి ఆ కార్‌పై ఎక్కి, అద్దాలు చిత‌క్కొట్టి, గాలి తీసేసి నానా హైరానా చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అయిపోతోంది. అయితే దాదాపు 10 ఏళ్ల త‌ర్వాత పాత గాయాన్ని తిరిగి త‌నూశ్రీ ద‌త్తా బ‌య‌ట‌కు కెలికిందంటే నానాపై అప్ప‌టి నుంచి కోపంతో ర‌గిలిపోతోంద‌నే అర్థం చేసుకోవ‌చ్చు. మి టు హ్యాష్‌ట్యాగ్ లాంటి విప్ల‌వం త‌న‌కు ధైర్యం తెచ్చి ఉండొచ్చు. మ‌రి ఈ ఎవిడెన్స్‌తో నానాను అరెస్టు చేసే ఛాన్సుందంటారా?