షాకిస్తున్న … బాలయ్య రెమ్యూనరేషన్ ?

Sunday, February 12th, 2017, 09:44:55 AM IST


నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో సినిమా ”గౌతమీపుత్ర శాతకర్ణి” తో మంచి విజయాన్ని అందుకుని విజయవంతంగా వంద చిత్రాలను పూర్తీ చేసాడు. ఇక అయన 101 వ సినిమాగా మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు కృష్ణవంశీ దర్శకత్వంలో ”రైతు” సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకోసం బాలయ్య రెమ్యూనరేష పెంచాడని సమాచారం. ఇప్పటివరకు 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలయ్య ఈ సినిమాకోసం ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసాడట !! ప్రస్తుతం ఈ విషయం ఫిలిం వర్గాల్లో సంచలనం గా మారింది. ఇంతకు ముందు బాలయ్య ఎప్పుడు ఇంతలా తన రెమ్యూనరేష ని పెంచలేదని, కానీ ఈ సినిమాకోసం ఏకంగా అయన పదికోట్లు డిమాండ్ చేస్తుండడం ఆసక్తి కలిగిస్తుంది.