స‌వాల్ విసురుతున్న నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ న్యూలుక్‌!

Saturday, March 24th, 2018, 09:12:00 PM IST

తార‌క్ అంటే ప‌ట్టుద‌ల‌.. ప‌ట్టుద‌ల అంటే తారక్‌! ప‌ట్టుద‌ల‌కు ప‌రాకాష్ట అత‌డు!! అందుకే న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముని న‌ట‌వార‌సునిగా అంత‌కంత‌కు త‌న స్టామినాని పెంచుకుంటూ దూసుకెళుతున్నాడు. టెంప‌ర్‌తో న్యూలుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన తార‌క్ అటుపై పూర్తిగా జిమ్స‌న్ అయిపోయాడు. జిమ్ముల్లో ఇర‌గ‌దీస్తున్నాడు. 6ప్యాక్ ఏం క‌ర్మ‌.. మునుముందు హృతిక్, టైగ‌ర్ ష్రాఫ్‌ల‌కే పోటీకొచ్చేట్టున్నాడు. పైగా ఆ ఇద్ద‌రికీ ట్రైనింగ్ ఇచ్చిన బాలీవుడ్‌, హాలీవుడ్ ఫిట్‌నెస్‌ ట్రైన‌ర్ లాయ్డ్ స్టీవెన్స్ ప్ర‌త్యేకంగా తార‌క్‌కి శిక్ష‌ణ‌నిస్తున్నాడు. ఇటీవ‌లే తార‌క్ మారిన రూపం అభిమానులు స‌హా అంద‌రికీ పెద్ద షాకిచ్చింది. తార‌క్ తాజా రూపం కోసం 100 రోజులుగా ఎంతో సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఇప్ప‌టికే 12 కేజీల బ‌రువు త‌గ్గ‌డం ఓ సెన్సేష‌న్‌.

టాలీవుడ్‌లోనే టాప్‌ జిమ్స‌న్‌లుగా పేరున్న‌ మెగా హీరోల‌తో పోటీప‌డుతూ తార‌క్ రూపం మార్చుకున్న తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి. తార‌క్ ఒక్క‌డే కాదు, త‌న బ్ర‌ద‌ర్ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ అంతే ప‌ట్టుద‌ల‌గా దూసుకొస్తున్నాడు. పూరితో `ఇజం` చేశాక త‌ను కూడా జిమ్ముల్లో భ‌ళ్లూక‌ప‌ట్టు ప‌ట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ తార‌క్‌, క‌ళ్యాణ్‌రామ్ కుస్తీలు ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్నాయ్‌. ఆ ఫోటోలు నెట్‌లో జోరుగానే వైర‌ల్ అవుతున్నాయి. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ప్ర‌స్తుతం రెండేసి క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగానూ ఉన్నాడు.