షాక్ .. బిగ్ బాస్ 2లో నందమూరి హీరో ?

Saturday, June 2nd, 2018, 11:06:08 AM IST

నాని హోస్ట్ గా బిగ్ బాస్ రెండో సీజన్ జూన్ 10 నుండి మొదలుకానుంది. ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ షో లో ఎవరెవరు పాల్గొంటారన్న విషయం షాకిస్తుంది. తాజాగా ఈ షో లో నందమూరి హీరో పాల్గొంటున్నాడన్న విషయం పై ఆసక్తి రేకెత్తింది. ఇంతకి నందమూరి హీరో అంటే ఎవరు అని షాక్ అవుతున్నారా .. అయన ఎవరో కాదు నందమూరి తారక రత్న. ఒకేసారి తొమ్మిది సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక రత్నకు ఆ స్థాయిలో సరైన విజయం దక్కలేదు. ఎన్ని ప్రయోగాలు చేసిన ఫలితం లేకపోవడంతో అటు నెగిటివ్ రోల్ లో కూడా నటించి ఆకట్టుకున్నాడు. మరి బిగ్ బాస్ 2 తో అయినా తారకరత్న క్రేజ్ పెరుగుతుందేమో చూద్దాం.