యువ ఎన్టీఆర్ పాత్రలో…మోక్షజ్ఞ ?

Wednesday, July 25th, 2018, 01:36:22 PM IST

అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో ఎన్టీఆర్ పేరుతొ తెరకెక్కుతున్న బయోపిక్ శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని ఫిలిం సిటీ లో పూర్తీ చేసుకుంది. ఈ విషయాన్నీ తాజాగా క్రిష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాలోకి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారట. ఇక ఈ సినిమాలో నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మోక్షజ్ఞ యంగ్ ఏజ్ లో ఉన్న ఎన్టీఆర్ గా కనిపిస్తాడని సమాచారం. బాలీవుడ్ క్రేజీ భామ విద్యాబాలన్ ఎన్టీఆర్ భార్య బసవతారకం గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇలా సెట్ అయింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments