సీఎం జగన్‌కి సవాల్ విసిరిన నందమూరి సుహాసిని..!

Tuesday, January 14th, 2020, 04:00:35 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు పెద్ద 28 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని రైతుల నిరసనలకు మద్ధతుగా నేడు మందడం దీక్షలో టీడీపీ మహిళా నేత నందమూరి సుహాసిని పాల్గొన్నారు.

అయితే ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దు అంటూ చెప్పుకొచ్చారు. అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదని అన్నారు. గత ప్రభుత్వంలో అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ చెబుతుందని, ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు వైసీపీ నిరూపించడం లేదని, ఒకవేల అది నిరూపించి చర్యలు తీసుకొవచ్చు అని సవాల్ విసిరారు. అయితే ఏ రాష్ట్రానికి అయిన రాజధాని ఒక్కటే ఉంటుందని, మహిళలపై జరుగుతున్న దాడులను తాను ఖండిస్తున్నానని అన్నారు.