స‌ర్‌ప్రైజింగ్‌ : నాని ఎన్టీఆర్ – నాగ‌చైత‌న్య ఏఎన్నార్‌?

Sunday, January 21st, 2018, 09:12:30 PM IST

కీర్తి సురేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా మ‌హాన‌టి. అశ్వ‌నిద‌త్ స‌మ‌ర్ప‌కుడిగా అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ చిత్రం 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే.ఈ చిత్రంలో శివాజీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్కార్ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. ఇత‌ర‌త్రా కీల‌క‌పాత్ర‌ల్లో ప్ర‌ముఖ న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకున్నారు. సావిత్రి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌తి పాత్రా ఎంతో కీల‌కం. సావిత్రి వెండితెర జీవితంలో ఓ ఇద్ద‌రు హీరోలు ఎంతో కీల‌కం. ఆ ఇద్ద‌రూ ఎన్టీఆర్, ఏఎన్నార్‌. ఆ ముగ్గురూ క‌లిసి ఎన్నో గ్రేట్ క్లాసిక్స్‌లో న‌టించారు.

అందుకే ఆ పాత్ర‌ల‌కు ఎంపిక చేసుకునే హీరోలు అంతే కీల‌కంగా మారారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ పాత్ర‌ల‌కు ఇద్ద‌రు ట్యాలెంటెడ్ స్టార్స్‌ని ఎంపిక చేసార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర‌లో నాని, ఏఎన్నార్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టిస్తార‌ని.. ఆ మేర‌కు చ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉందింకా.