షాకిస్తున్న‌ నాని రెమ్యున‌రేష‌న్

Thursday, June 7th, 2018, 02:14:02 PM IST

బుల్లితెర‌పై షాకిచ్చే రెమ్యున‌రేష‌న్ ఏది? ఇంత‌వ‌ర‌కూ బెస్ట్ పారితోషికం అందుకున్న టాప్ హోస్ట్ ఎవ‌రు? అంటే నాలుగైదు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగ‌ర్జున పేర్లు ఇదివ‌ర‌కూ ప్ర‌ముఖంగా వినిపించాయి. సాయికుమార్, అలీ, బ్ర‌హ్మానందం వంటి న‌టులు బుల్లితెర హోస్టింగ్ చేసి బాగానే ఆర్జించారు. అయితే ఎంద‌రు ఉన్నా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అంద‌రి రికార్డుల్ని బ్రేక్ చేస్తూ ఎపిసోడ్‌కి 50ల‌క్ష‌ల చొప్పున `బిగ్‌బాస్‌` హోస్టింగుకి పారితోషికం అందుకున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే అంతే పెద్ద టీఆర్‌పీని స‌ద‌రు చానెల్‌కి అందించాడు.

ప్ర‌స్తుతం బిగ్‌బాస్ సీజ‌న్ 2కి నాని హోస్టింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హోస్ట్‌గా నాని అందుకుంటున్న మొత్తం ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అస‌లు నానీ అనే హీరోకి అంత సీనుందా? అనుకునేవారికి ఎంత సీనుందో చూపిస్తున్నాడు. అత‌డు ఒక్కో ఎపిసోడ్‌కి ఏకంగా రూ.10ల‌క్ష‌లు అందుకుంటూ ఏకంగా 100 ఎపిసోడ్ల‌కు 10 కోట్లు అందుకుంటున్నాడు. కోట్లు అంటే తొడుక్కునేవి కావు. బ్యాంక్ ఖాతాలో మ‌ళ్లించే సొమ్ములు.. ఎన్టీఆర్ త‌ర‌వాత మ‌ళ్లీ బిగ్‌బాస్ షోని నాని ఓ ఊపు ఊపుతాడ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఆ క్ర‌మంలోనే అత‌డి పారితోషికం పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు సినిమాల‌కు అత‌డు పారితోషికం డ‌బుల్ చేసి ఏకంగా 7-8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌న్న టాక్ కూడా ఉంది.