బిగ్ బాస్ టాక్ పై స్పందించిన నాని !

Tuesday, April 10th, 2018, 10:08:29 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న వారిలో హీరో నాని ముందు వరుసలో ఉన్నడని అందరికి తెలిసిందే. గత కొంత కాలంగా నాని ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే షూటింగ్ లలో పాల్గోంటునే నాని మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ షో వ్యాఖ్యాతగా కూడా కనిపిస్తాడని అనేక వార్తలు వచ్చాయి. అధికారికంగా ఎవరు ఆ విషయంపై స్పందించలేదు అనుకుంటున్న సమయంలో నాని రెస్పాండ్ అయ్యాడు.

బిగ్ బాస్ సెకండ్ సీజన్ గురించి తాను ఇప్పుడే ఎలాంటి విషయాన్ని చెప్పలేను అంటూ.. ఇంతవరకు ఎవరు తనను సంప్రదించలేదని చెప్పాడు. ఒకవేళ అలాంటి అఫర్ వస్తే గనక తప్పకుండా చెబుతానని నాని వివరించాడు. ఇక ఈ వారం నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ కాబోతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. మరి సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.