ఈగ‌-2పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్

Thursday, September 29th, 2016, 12:49:04 AM IST

nani
నాని-రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఫాంట‌సీ చిత్రం ఈగ సెన్సేష‌న్స్ గురించి తెలిసిందే. తొలిసారి ఈ ద్వ‌యం టాలీవుడ్లో ఓ కొత్త ప్ర‌యోగం చేసి స‌క్సెస్ అయ్యారు. ఫాంట‌సీ సినిమాలు అల‌వాటు ప‌డ‌ని మ‌న జ‌నాలకు స‌రికొత్త విజువ‌ల్ ట్రీట్ ఇచ్చి శ‌భాష్ అనిపించుకున్నాడు జ‌క్క‌న్న‌. అంత‌ర్జాతీయ స్థాయిలోనూ రాజ‌మౌళి పేరు మార్మోగింది. ఇటు క‌మ‌ర్శియ‌ల్ గానూ హిట్ అయింది. ఇందులో నాని క్యారెక్ట‌ర్ చిన్న‌దే అయినా ఆ ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వ్వ‌డ‌మే గొప్ప‌గా చెప్పుకుంటాడు. త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ఈగ‌-2 కూడా చేసే అవ‌కాశాలున్న‌ట్లు వార్తలు వ‌చ్చాయి. బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న్న ప్రాజెక్ట్ ఇదేన‌ని మ‌రోసారి ప్ర‌చారం జోరందుకుంది. ఈ విష‌యాన్ని నాని వ‌ద్ద ప్ర‌స్తావిస్తే…

ఈగ‌-2 రావాల‌ని నేనూ కోరుకుంటున్నా. తొలి భాగంలో నా క్యారెక్ట‌ర్ చ‌నిపోతుంది కాబ‌ట్టి సెకెండ్ పార్టులో నా పాత్ర ఉండ‌దు. అయినా ఈగ -2 రావాల‌ని ఆశిస్తున్నా. ఏ నిర్ణ‌య‌మైనా రాజ‌మౌళి తీసుకోవాలి. నేను ఆ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని తెలిపాడు. మ‌రి జ‌క్క‌న్న మ‌న‌సులో ఏముందో?

  •  
  •  
  •  
  •  

Comments