రెమ్యునరేష్ కంటే నాకు అదే ఎక్కువ : నాని కౌంటర్

Friday, April 13th, 2018, 05:56:27 PM IST

సౌత్ మొత్తంలో మంచి సక్సెస్ రేట్ ఉన్న నటుల్లో నాని ఒకరు. వరుసగా ఆఫర్లు అందుకుంటూ మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు. గత కొంత కాలంగా అతని కెరీర్ లో పెద్దగా అపజయాలు లేవని అందరికి తెలిసిందే. అంతే కాకుండా నాని సినిమాల బిజినెస్ పెరుగుతూ వస్తుండడంతో ఒక్కసారిగా రెమ్యునరేషన్ పై అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. మొన్నటి వరకు నాని 9 కోట్ల వరకు తీసుకున్నాడని ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం కమర్షియల్ హిట్టు కొడితే 10 కోట్ల మార్కును దాటేసిన స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడని అనేక వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయంపై నాని తనదైన శైలిలో నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. నాని మాట్లాడుతూ.. స్పెషల్ గా రెమ్యునరేషన్ అంతగా పెంచడం వీలుపడదు. ఒక సినిమా బిజినెస్ జరిగే విధానం బట్టి రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి సినిమా ఆడకుంటే మళ్లీ రెమ్యునరేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడు సక్సెస్ లను అందుకోవడం అందరికి సాధ్యం కాదని అంటూ.. సక్సెస్ లు ఎప్పటికి శాశ్వతం కాదని నాని సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా రెమ్యునరేషన్ కన్నా నాకు ఆదరాభిమానాలే ఎక్కువని అదే ముఖ్యమని సమాధానం ఇచ్చాడు.