బిగ్ బాస్ హోస్ట్ గా నాని కన్ఫర్మ్!

Saturday, May 19th, 2018, 12:25:48 AM IST

దేశవ్యాప్తంగా సంచలన షో గా పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రస్తుతం దాదాపుగా తెలియని వారుండరు అని చెప్పాలి. మొదట హిందీలో మంచి పాపులర్ అయిన ఈ షో, ఆ తర్వాత పలు రీజినల్ భాషల్లో కూడా ప్రసార మవుతూ మంచి రేటింగ్స్ సంపాదించింది. ఇటీవల తెలుగులో స్టార్ మా ఛానల్లో ప్రసారమైన బిగ్ బాస్ షో కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై ఈ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా ఆ షో లో పాల్గొన్న వారిలో నటుడు శివబాలాజీ ఫైనల్ లో విజేతగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ తరువాత రెండవ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు అప్పటినుండి ఎదురుచూపులు చూడ సాగారు. అయితే ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం ఈ షో షూటింగ్ ప్రారంభమైందని, అలానే నాచురల్ స్టార్ నాని ని ఈ షో కి హోస్ట్ గా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పటివరకు మాత్రం ఈ విషయమై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం స్టార్ మా ఛానల్ వారు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బిగ్ బాస్ 2 షో కి హోస్ట్ గా నాచురల్ స్టార్ నానిని తీసుకున్నామని, ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆయనకు వెల్కమ్ చెపుతూ, షో మంచి సక్సెస్ కావాలని ట్వీట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ మొదటి భాగంలో 70 రోజులపాటు జరిగిన షో ప్రస్తుతం 100 రోజులు జరగనుందని, అలానే కంటెస్టెంట్ లు కూడా మొదటి భాగముకంటె ఈ భాగంలో ఇంకా ఎక్కువమంది పాల్గొంటున్నట్లు వార్త అందుతోంది. అయితే ఈ విషయమై కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో అదికూడా స్టార్ మా ఛానల్ వారు ప్రకటించే వరకు వేచి చూడక తప్పదు మరి……

  •  
  •  
  •  
  •  

Comments