యుద్దానికి శర్వానంద్ నో..!

Wednesday, January 17th, 2018, 01:10:41 AM IST

నాని ద్విపాత్రాభినయంలో నటిస్తోన్న కృష్ణార్జునయుద్ధం ఆసక్తిని రేపుతోంది. కృష్ణగా నాని మాస్ లుక్ లో, అర్జున్ గా క్లాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. వీరిద్దరి మధ్య ఎటువంటి యుద్ధం జరిగిందనేది కృష్ణార్జున యుద్ధం అన్నమాట. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. మొదట మేర్లపాక గాంధీ ఈ కథని యువ హీరో శర్మానంద్ కి వినిపించాడట. తనకు ఈ స్టోరీ సూట్ కాదని శర్వానంద్ అనుమానం వ్యక్తం చేయడంతో మేర్లపాక గాంధీ నానికి కథని వినిపించాడు.

నాని సూచించిన మార్పులకు డైరెక్టర్ ఓకె చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది. డ్యూయెల్ రోల్ లో నాని తన స్టైల్ లో చెలరేగి నటించాడని సమాచారం. ప్రస్తుతం నాని కెరీర్ పట్టిందల్లా బంగారం అన్నట్లుగా సాగుతోంది. డివైడ్ టాక్ తోనే ఎంసీఏ చిత్రం సూపర్ హిట్ రేంజ్ కలెక్షన్లని సాధించి ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్య పరిచింది. కృష్ణార్జున యుద్ధం ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.