గజదొంగగా నాని .. మరో బయోపిక్ కు సన్నాహాలు ?

Thursday, June 7th, 2018, 04:05:00 PM IST

టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాల హావ ఊపందుకుంది. మహానటి సినిమా సక్సెస్ తో ఈ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు కొత్త ఊపు వచ్చింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు యాత్ర పేరుతొ వై ఎస్ బయోపిక్ కూడా సెట్స్ పైకి వచ్చేసింది. ఇక వీటితో పాటు కత్తి కాంతారావు, మెగాస్టార్ హీరోగా చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ( సైరా ) తాజాగా కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ కూడా లైన్ లో ఉంది. దాంతో పాటు స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కూడా సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వర రావు గా నటించేందుకు హీరో రానా ఓకే చెప్పాడు .. కానీ అంతలోనే అయన ఆ సినిమానుండి తప్పుకోవడంతో దర్శక నిర్మాతలు నానిని సంప్రదించారట. కథ నచ్చడంతో నాని ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాలో నాని గజదొంగ గా కనిపించనున్నాడు. స్టువర్ట్ పురం ఏరియాలో టైగర్ నాగేశ్వర రావు పేరు మోసిన మోసగాడు, గజదొంగగా పాపులర్ అయ్యాడు. ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన అయన ఓ భారీ పోలీస్ ఎంకౌంటర్ లో చనిపోయాడు. ఈ సినిమాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడట. సో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.