అతనితో నాని ప్రాజెక్ట్.. సెట్ అయ్యిందా ?

Saturday, January 27th, 2018, 06:45:36 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం అందరికంటే స్పీడ్ గా సక్సెస్ లతో దూసుకుపోతోన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అందరూ నాని అని చెప్పేస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తోన్న సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అందుకే నిర్మాతలు దర్శకులు నాని కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ లిస్ట్ లో ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల కూడా ఉన్నాడట. నటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన శ్రీనివాస్ ఊహలు గుస గుస లాడే సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

అయితే శ్రీనివాస్ నాని కోసం ఒక మంచి కథను సిద్ధం చేశాడట. గత కొంత కాలమే ఈ విషయాన్ని చెప్పినా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనే మ్యాటర్ మాత్రం చెప్పలేడు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీనివాస్ కాన్సెప్ట్ ను నాని ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే అధికారకంగా సోషల్ మీడియాలో న్యూ ప్రాజెక్ట్ గురించి నాని వివవరించనున్నాడు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.