నానికి బిజినెస్ తో పాటు దర్శకులు కూడా పెరుగుతున్నారు!

Friday, March 16th, 2018, 12:31:55 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్న హీరోల్లో నాని ఒకరని అందరికి తెలిసిన విషయమే. తన ప్రతి సినిమాకు నాని మార్కెట్ ను పెంచుకుంటూనే వెళుతున్నాడు. ప్రస్తుతం నాని సినిమాలు 30 కోట్లవరకు బిజినెస్ చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా నాని మార్కెట్ కు తగ్గట్టుగా దర్శకులను సెట్ చేసుకొని సినిమాలనుజ్ నిర్మించాలని డిసైడ్ అయ్యారట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. భరత్ అనే నేను సినిమా రిలీజ్ తరువాత హడావుడి మొత్తం అయిపోగానే కొరటాల నానితో సినిమా స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. నాని కూడా కొరటాల తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొరటాల సన్నిహితులు ఆ సినిమాను నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్ తో కూడా నాని సినిమా చేయనున్నాడని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే నానినే అన్సార్ ఇవ్వాలి.